గురుకులంలో బాలిక మృతి బాధాకరం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో హుజురాబాద్ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని,దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు ఆయన రాంపూర్ గ్రామానికి వెళ్ళి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా బాలిక తల్లితండ్రులు … Read more

రాజీవ్ యువ వికాసం పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

వీణవంక/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కుతూ యావత్ ప్రజానీకాన్ని మోసం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలను ఆరు గ్యారంటీలను 420 హామీలను అమలు దిశగా చర్యలు చేపట్టాలని యువతకు రాజీవ్ యువ వికాసం పథకం 2025 దరఖాస్తు  ఏప్రిల్ 14,  ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగ యువతకు రాయితీ రుణాలను ఇస్తానని చెప్పి మోసం చేసి నేటి వరకు … Read more

సిరిసేడులో బాడీ ఫ్రీజర్ బాక్స్ వితరణ

ఇల్లందకుంట,అక్టోబర్21: ఇల్లందకుంట మండలం సిరిసేడు ప్రజల అవసరార్థం బాడీ ఫ్రీజర్ బాక్స్ ని షఫీ ఖాన్  తన సొంత నిధులతో కొనుగోలు చేసి మంగళవారం గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ కి వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా షఫీ ఖాన్ మాట్లాడుతూ… తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ ప్రజలకు సౌకర్యం కోసం సుమారు 61వేల రూపాయల విలువ చేసే ఫ్రీజర్ బాక్స్ ని అందజేసినట్లు తెలిపారు. ప్రజల కోరిక మేరకు భవిష్యత్ లో వైకుంఠ రథం కూడా … Read more

హుజురాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురుతుంది – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:హుజురాబాద్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచే ప్రతిపాదనను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుకు తెచ్చారని గుర్తుచేశారు. బీసీలకు న్యాయం చేసే విషయంలో తమ పార్టీ ఎప్పటికీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. … Read more

సైదాపూర్‌లో బిఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో

సైదాపూర్, సెప్టెంబర్ 2 (ధనాధన్ న్యూస్):సైదాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ –రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. వారానికి ఒక్కటి రెండు లారీలు యూరియా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై … Read more

బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 2:భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్ వెనుక కారణాలు ఇటీవల కాలంలో కవిత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని, పార్టీకి ఇబ్బందులు కలిగించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణలో లోపం ప్రదర్శించినందుకు … Read more

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్, ఆగష్టు 26: తెలంగాణలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ కోసం కీలకమైన ఓటర్ల జాబితా సవరణ పనులను ప్రారంభించింది. హైకోర్టు కీలక తీర్పు 2024 జనవరి 31తోనే తెలంగాణలోని సర్పంచుల పదవీకాలం ముగిసింది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ చెక్ పవర్ నిలిచిపోగా, … Read more

ఆదివాసి ఎరుకల కులస్తులకు అండగా ఉంటాం

వరంగల్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ పార్టీ రజతోఉత్సవ సభ పరిశీలన సందర్భంగా వరంగల్ మీదుగా ఎలుకతుర్తికి వచ్చిన కే కవితక్కని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఆదివాసి ఎరుకల సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు  ( నాంచారమ్మ )  ఎరుకల బుట్టను ఇచ్చి  స్వాగతం  పలికారు.కవితక్క  ఆదివాసి ఎరుకల జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ గత కేసీఆర్ … Read more

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు గ్రామ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలనీ బిఆర్ఎస్ కొత్తపల్లి మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ఆకుల రవీందర్ పటేల్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ కానీ విని ఎరుగని రీతిలో జరగనుందని రవీందర్ పటేల్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27న జరగనున్న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కెసిఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలంతా … Read more