సైదాపూర్ మండలంలో బిసి జేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిన బంద్

By dhanadhannews.com

సైదాపూర్, అక్టోబర్ 19 :
తెలంగాణ రాష్ట్ర బిసి సంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను సైదాపూర్ మండలంలో కూడా విజయవంతంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలన్నింటిలో వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు.

మండల బిసి జేఏసీ అధ్యక్షుడు జంపాల భూపతి మాట్లాడుతూ —
“బీసీలకు 42 శాతం రాజకీయ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది. ఆ బిల్లును కేంద్రం 9వ షెడ్యూల్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండటంతో బిసి వర్గానికి న్యాయం జరగడం లేదు” అని తెలిపారు.

ఈ బంద్‌లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంత సుధాకర్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సోమవారపు రాజయ్య, ఎంఆర్ఫీఎస్ నాయకులు పొడిశెట్టి వెంకటరాజం, సామాజిక కార్యకర్త గాదేపాక కుమార్ రాజా, మాల మహానాడు నాయకులు బోనగిరి అనిల్ కుమార్, వెనమల రమేష్, మాడెపు రాహుల్, దంత సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే ముదిరాజ్ సంఘ నాయకులు రాయిశెట్టి చంద్రయ్య, పెసరు కుమారస్వామి, పోలు ప్రవీణ్, రేగుల అశోక్, నీళ్ల సతీష్, గూళ్ల అజయ్, వస్తాదుల సదానందం, నెల్లి రాములు, నెల్లిపోచయ్య, గాజుల రవేణి మల్లయ్య, రావిశెట్టి రఘుపతి, భాష వేణి సంపత్, దయాల శ్రీనివాస్, భాష వేణి రాకేష్, రావిశెట్టి పవన్, రాయిశెట్టి ఐలయ్య, భాష వేణి రాజయ్య, సురేష్ గౌడ్ సంఘం నాయకులు నాదెండ్ల రాజ్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగాని రాజు, గోపగాని నవీన్, మాచర్ల రమేష్, సామాజిక కార్యకర్త గున్నాల కృష్ణమూర్తి గౌడ్, బీజేపీ నాయకులు జంపాల సంతోష్, నెల్లి శ్రీనివాస్, సిపిఐ నాయకుడు వాసుదేవ్, రజక సంఘం నాయకులు మునిగంటి సంతోష్, గుడికందుల రాజు, యాదవ సంఘం నాయకులు మేకల రాజు, మారవేణి శ్రీనివాస్, తొంట రజనీకాంత్, పద్మశాలి సంఘం నాయకులు కామిని వీరేశం, ఊసకోయిల రాఘవులు, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు జంపాల సంతోష్, జంపాల భూపతి తదితరులు పాల్గొని బంద్ విజయవంతం చేశారు.

ఈ బంద్ మొత్తాన్ని శాంతియుతంగా నిర్వహించడంలో పోలీసులు, స్థానిక సంఘాలు సమన్వయం చేసుకున్నారు. మండల వ్యాప్తంగా బిసి జేఏసీ శక్తిని చాటిన ఈ బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం.