జగిత్యాల/ధనాధన్ న్యూస్: జగిత్యాల పట్టణంలోని అంగడిబజార్‌లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్‌కు విద్యుత్ సరఫరా కొనసాగుతుండగా, సమీపంలోని చెట్ల ఆకులు తినేందుకు వచ్చిన ఓ ఆవు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడంతో మరింత ప్రమాదం తప్పింది. ఆవు స్థానంలో ఎవరైనా వ్యక్తి వెళ్లి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ మీటర్లు, బహిర్గత విద్యుత్ వైర్లు వంటి వాటిని వెంటనే తొలగించాలని స్థానికులు విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply