మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజుల వినోద్ ఆధ్వర్యంలో పలువురికి సన్మానం

By dhanadhannews.com

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని  సర్వాయిపేట మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజుల వినోద్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగని పురస్కరించుకుని నూతనంగా సైదాపూర్ ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన స్వాతి నీ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు .అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్  దొంత సుధాకర్ ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.అనంతరం  బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మాల సంక్షేమం సంఘం తరపున  శాలువా కప్పి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచులకు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్వాయిపేట సర్పంచ్ పోల్ సరూప ,పెర్కపల్లి సర్పంచ్ బబిత , గొల్లగూడం బత్తుల మౌనిక ,ఉప సర్పంచ్ గొల్లగూడెం,దుస్స కుమార్ సర్వాయిపేట మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజుల వినోద్, వేముల మహేశ్వర్,గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి సంతోష్, కార్యవర్గ సభ్యులు,రాజుల విజయ్,దొంత హరీష్,పసరగొండ ప్రశాంత్,వేముల రమేష్,కాసర్ల మురళి కృష్ణ, బోగం రాకేష్.మాల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు