నూజివీడు సీడ్స్ నూతన వంగడం క్షేత్ర ప్రదర్శన

By dhanadhannews.com

రామడుగు(ధనాధన్ న్యూస్)ఏప్రిల్25:రామడుగు మండలంలోని వెధిర గ్రామంలో బుధవారం రోజున నూజివీడు సీడ్స్ కంపెనీ వరి పుష్కల్ (ఎన్ పి 9153) దొడ్డు రకమును గ్రామానికి చెందిన వాసు రావు వ్యవసాయ పొలంలో రైతులతో క్షేత్రస్థాయి ప్రదర్శన  నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కంపెనీ సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పుష్కల్ వరి వంగడం మిగతా రకాల వరి వంగడాల కంటే నాలుగైదు క్వింటాలు అధిక దిగుబడి వస్తుందని అన్నారు.ఈ రకం వానాకాలం,యాసంగి రెండు కాలాలకు అనుకూలమైనదని,ఈ రకము 120 నుంచి 125 రోజుల కాల పరిమితి,అగ్గి తెగులు మరియు పాము పోడ తెగులు,సుడిదోమను తట్టుకుంటుందని అన్నారు.ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి సుమారుగా 140 మంది రైతులు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమాన్ని సందర్శించారు.కంపెనీ ఏరియా మేనేజర్ నీల రాజు,మార్కెటింగ్ ఆఫీసర్ బారీ రాము, జెఎస్వో సంతోష్ తదితరులు పాల్గొన్నారు.