సిరిసేడు గ్రామపంచాయతీ పాలక మండలి కి పదవి విరమణ సన్మానం.

By dhanadhannews.com

సిరిసేడు పాలకవర్గం.

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియగా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామ పంచాయతీ పాలకమండలికి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి అంకుస్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి పథకాలని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ గ్రామంలో అన్ని వీధులకు సిసి రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు చేసి సేవలందించినందుకు గాను గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.. అనంతరం వార్డు సభ్యులు మాట్లాడుతూ తమ హయాంలో సాధ్యమైనంతవరకు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడినమని మిగిలిన ఏవైనా పనులు ఉన్నట్లయితే ప్రత్యేక అధికారులు, కార్యదర్శి పూర్తి చేయాలని కోరుతూ ఓట్లు వేసి ఈ అవకాశాన్ని కల్పించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అంకుస్,ఉప సర్పంచ్ పుట్ట స్వరూప-సదయ్య, వార్డు సభ్యులు ఆలేటి రమేష్,అనగోని మంజుల – రమేష్,బొమ్మడి అనిత-గణపతి,రేనుకుంట్ల రాజు,భోగం చంద్రమౌళి, రేనుకుంట్ల శ్యామల – కుమార్, భోగం విజయ శ్రీ – రాజేందర్,కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ నెరేళ్ల కుమార్, కొరిమిండ్ల చిరంజీవి, మురహరి నరేందర్, రేనుకుంట్ల సారయ్య, సిబ్బంది గందసిరి సంపత్,రేనుకుంట్ల రవి తదితరులు పాల్గొన్నారు.