కాంగ్రెస్ కార్యకర్తల్లో నైరాశ్యం

By dhanadhannews.com

  • కొత్త చేరికలతో ఆందోళన లో కాంగ్రెస్ కార్యకర్తలు
  • ఇప్పటికే గ్రూప్ రాజకీయాలతో సతమతం
  • పక్కా హామీలతో కొత్త చేరికలు ఉంటే మరి మా పరిస్థితి ఏంటి?
  • బీఆర్ఎస్ కౌన్సిలర్ల చేరికతో ఒక్కసారిగా మారిన పార్టీ స్వరూపం

జమ్మికుంట,ధనాధన్ న్యూస్:

జమ్మికుంట కాంగ్రెస్ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. రాష్ట్రం లో పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ జెండా మోసిన మా పరిస్థితి పార్టీ అధికారంలోకి రాగానే ఎం జరుగుతుందోనని కాంగ్రెస్ కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నట్లు వినికిడి. గత పది సంవత్సరాలు గా అప్పటి అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసిన, అక్రమ కేసులు పెట్టిన ఆ బాధలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మాకు కీలక సమయంలో అన్యాయం జరుగుతుందేమోనని కాంగ్రెస్ పెద్దల దగ్గరకి క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది.

ఈ పరిస్థితి కి గల కారణాలు ఇవే కావచ్చునేమో మరీ?.

జమ్మికుంట మున్సిపాలిటీ లో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్బంలో చైర్మన్ వ్యతిరేకంగా ఉన్న వర్గం అవిశ్వాసంలో ఫెయిల్ కావడంతో చైర్మన్ పీఠం ఆశించిన కాంగ్రెస్ కి నిరాశ ఎదురైంది. ఈ పూర్తి సంఘటనకు సంబందించిన విషయాలు జమ్మికుంట కి చెందిన కాంగ్రెస్ ప్రధాన నాయకులకు తెలియవని వినికిడి. ఈ అవిశ్వాస తీర్మానం లో పాల్గొన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఇటీవల కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోవడంతో జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ ముఖ చిత్రం ఒక్కసారిగా మారింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పక్కా బీ ఫామ్ హామీతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని, వింటున్న కాంగ్రెస్ కార్యకర్తలు నైరాశ్యానికి గురవుతున్నారు. ఇన్ని రోజులు పార్టీ ని నమ్ముకుని వార్డుల్లో కౌన్సిలర్లు గా పోటీ చేయడానికి వార్డ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ ని జనం లోకి తీసుకెళ్లిన మా పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

  • నామినేటెడ్ పదవులపై ఆశలెన్నో.

జిల్లాలో అతిపెద్ద వ్యాపార కేంద్రంగా ఉన్న జమ్మికుంట లో నామినేటెడ్ పదవులు దక్కడం అంటే ఆషామాషి కాదు. ఇప్పటి వరకు కొద్దిమంది క్రియా శీల కార్యకర్తలు ఉన్న కాంగ్రెస్ లో కీలక నామినేటెడ్ పదవులు పక్కా అన్న ఆశతో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆశలు బరాబరే ఉన్న, పార్టీ లో నూతనంగా చేరిన వారితో పోటీ నెలకొనే పరిస్థితి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇటీవల పార్టీ లో చేరిన కొందరు మార్కెట్ పాలకవర్గం లో కీలక పదవులపై ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తుంది.

  • కాంగ్రెస్ కమిటీల్లో గందరగోళం.

జమ్మికుంట మండల,పట్టణ కమిటీల్లో నెలకొన్న గందరగోళం తో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు.ఇద్దరిద్దరూ ప్రెసిడెంట్లు ఉండడంతో కార్యకర్తలను సమన్వయం చేయడం కష్టంగా మారింది. పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ మనుగడ ను కాపాడాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురావేయాలంటే కార్యకర్తల సమన్వయం ముఖ్యమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

  • ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు కలుగజేసుకొని కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని పోడగొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.