- జమ్మికుంటలో బాల్క సుమన్ దిష్టి బొమ్మ దగ్ధం
- దళితుల మనోభావాలను దెబ్బ తీస్తున్న బాల్క సుమన్.
జమ్మికుంట,ధనాధన్ న్యూస్:
జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కించపరుస్తూ వారికి చెప్పును చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ బాల్క సుమన్ దొరల గడిల వద్ద కుక్క లాగా కాపలా కాస్తు దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం సరికాదంటూ,బాల్క సుమన్ ఓయూలో విద్యార్థి నాయకుడు అని చెప్పుకుంటూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసింది ఏమీ లేదంటూ అక్కడున్నటువంటి విద్యార్థుల జీవితాలను కేసీఆర్ కు తాకట్టు పెట్టే విధంగా ప్రవర్తించిన వ్యక్తి బాల్క సుమన్ అని అన్నారు.ఇకముందు కాంగ్రెస్ పార్టీ గురించి గానీ కాంగ్రెస్ నాయకుల గురించి గానీ కార్యకర్తల గురించి గానీ అనుచితంగా మాట్లాడినా,వ్యవహరించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరంటూ హెచ్చరిస్తూ బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది.ఈ ధర్నా కార్యక్రమంలో ఓబీసీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి యుగ్గని శ్రీనివాస్,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్తిరెడ్డి,ముద్దమల్ల రవి,పోతుల శ్రీనివాస్, ప్రణవ్,ఎండి సలీం పాషా,పోతిరెడ్డి మల్లయ్య, పాతకాల అనిల్,మొలుగురి రమేష్,మొలుగూరి రంజిత్,చంచల శ్రీనివాస్,రాజమౌళి,ప్రభుదాస్,
రమేష్,కమలాకర్,సందీప్,శ్రీకాంత్, నవీన్,అశోక్,రవి,పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
