- జమ్మికుంట పట్టణ నూతన సీఐ వరంగంటి రవి
జమ్మికుంట,ధనాధన్ న్యూస్:
జమ్మికుంట పట్టణ సీఐ గా వరగంటి రవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో రామగుండం ట్రాఫిక్ సీఐగా,అదేవిధంగా కరీంనగర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో వరగంటి రవి విధులు నిర్వహించి జమ్మికుంట సీఐగా బదిలీపై వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ తెలిపారు.పట్టణంలో ట్రాఫిక్ తో పాటు చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఆయన అన్నారు.ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న తనను నేరుగా సంప్రదించాలని ఆయన కోరారు.
