- కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్:
ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామనికి చెందిన శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా కొండ విజయ్ ని ఏకగ్రీవంగా శనివారం ఎన్నిక చేస్తూ నియామకపు పత్రాన్ని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అందజేశారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కమిటీకి సూచించారు.అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కొండ విజయ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఆలయ కమిటీ చైర్మన్ నియామకం చేసిన నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కి,సిరిసేడు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులుగా గన్ను శ్రీకాంత్,ఆలయ ధర్మకర్తలుగా మురహరి నరేందర్,రేనుకుంట్ల సారయ్య,కోడం రజిత- శ్రీనివాస్,వేముల సుధాకర్ రెడ్డి,జిల్లెల్ల దేవేందర్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలి రామారావు,ఇల్లందకుంట మైనార్టీ సెల్ అధ్యక్షులు అజ్గర్ పాషా,
కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ నేరెళ్ల కుమార్, భోగం సాయి రాం,చలపతి,కురిమిండ్ల చిరంజీవి,మరిగిద్ద మొగిలి,కొక్కుల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
