తమిళనాడు లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడింలో ఫిబ్రవరి 27నుండి 29 జరిగిన – 46 కేజీ వయస్సులో విజయవంతంగా రెండో రౌండ్ పూర్తి చేసుకొని మూడవ రౌండ్ లో తృతీయ స్థానం సాధించి భ్రాంజ్ మెడల్ అందుకొని వచ్చిన వీణవంక మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బబ్బూరి అక్షిత వీణవంక ప్రభుత్వ హైస్కూల్ లో 10 వ తరగతి చదువుకుంటూ క్రీడలపై ఉన్న మక్కువతో తైక్వాండో అనే క్రీడను ఎంచుకొని తైక్వాండో అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బావు సంపత్ దగ్గర శిక్షణ పొంది రాష్ట్ర, సౌత్ జోన్ లో మెడల్ సాధించి
ఆల్ ఇండియా జాతీయ స్థాయి పోటీలు ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో పోటీలు ఎంపిక కావడం అభినందనీయం అని కొనియాడారు.అదే విధంగా ఆల్ ఇండియా నేషనల్ మీట్ లో మెడల్స్ సాధించి ఈ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం విజయం సాధించిన బబ్బురి అక్షిత ను కోచ్ బావు సంపత్ లను శాలువ కప్పి పుష్ప గుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జాతీయ క్రీడాకారుల అంబాల ప్రభాకర్ రావు మాట్లాడుతూ చదువుతోపాటు మానసిక ఉల్లాసానికి సమాజంలో గౌరవాన్ని తీసుకువచ్చేలా తోడ్పడతాయని తెలిపారు, విద్యార్థిని విద్యార్థులు చెడు వ్యసనాలకు చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తు కోసం బాగా చదువుతూ మక్కువ పెంచుకొని తల్లిదండ్రులు కన్నా కలలను సాకారం చేస్తూ గొప్ప పేరు తెచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ వీణవంక మండల అధ్యక్షులు నీల నాగరాజు పాల్గొన్నారు.
