
జమ్మికుంట పట్టణంలో సోమవారం జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో 21 ఓట్ల మెజార్టీతో కె.ఆర్.వి నరసయ్య తన సమీప అభ్యర్థి గర్రెపల్లి వెంకటేశ్వర్లుపై గెలుపొందినట్లు ఎన్నికల అధికారి పబ్బతి రాజగోపాల్,కన్వీనర్ ముక్క వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం 1626 ఓట్లు ఉండగా 662 ఓట్లు పోలైనవి.ఇందులో కె.ఆర్.వి నరసయ్యకు 337 ఓట్లు రాగా గర్రెపల్లి వెంకటేశ్వర్లకు 316 ఓట్లు వచ్చాయని మూడవ స్థానంలో కె.ఆర్.వి నరసయ్యకు మద్దతు తెలిపిన కొండ్లె పాపయ్యకు ఏడు ఓట్లు వచ్చాయని రెండు ఓట్లు చెల్ల లేదని వారు తెలిపారు.ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడగా చివరకు 21 ఓట్లతో కేఆర్వి నరసయ్య గెలుపొందినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు చందా రాజు,ఆర్యవైశ్య సంఘం హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఎలిమిళ్ళ రాజేంద్రప్రసాద్,ఆర్యవైశ్య సంఘం జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు అయిత మహేష్,ఆర్యవైశ్య సంఘం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు యాద సతీష్,ప్రధాన కార్యదర్శి ఆకినపల్లి మురళి ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.