బీసీ రాజకీయ పోరాట సమితి యువజన విభాగం (BRPSY) జిల్లా అధ్యక్షులుగా పంజాల రేవంత్ గారిని నియమిస్తూ బీసీ రాజకీయ పోరాట సమితి (BRPS) రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.బీసీల రాజకీయ అధికారం కోసం,బీసీ నాయకత్వాన్ని పెంపొందించేందుకు నిరంతరం పని చేయాలని సూచించారు.ఎంతో నమ్మకంగా తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.
- బీసీల రాజకీయ వాటా సాధిస్తాం
బీసీ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్
బీసీలకు రాజకీయ వాటా సాధిస్తామని బీసీ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ పేర్కొన్నారు.ఈ రోజు హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాజకీయంగా అన్ని పార్టీలు మొండి చేయి చూపుతున్నాయని,బీసీలకు రాజకీయంగా తగిన వాటా సాధించాల్సినటువంటి అవసరం ఉన్నదని, బీసీ రాజకీయ నాయకులను తయారు చేయడానికి, బీసీ నాయకులకు రాజకీయ అవకాశాలు అందించడానికి పోరాటం చేస్తామని అన్ని పార్టీలు బీసీలను కేవలం ఓట్ బ్యాంకుగా వాడుకుంటున్నాయి తప్ప అవకాశాలు ఇవ్వడంలో మోసం చేస్తున్నాయి. కనుక బీసీలను ఐక్యపరిచి రాజకీయవాట సాధిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్పిఎస్ నాయకులు చిలకమరి శ్రీనివాస్, మహేష్,అజయ్ ,నవీన్,తదితరులు పాల్గొన్నారు.
