సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో విఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించి,లస్మన్నపల్లె ప్రజలకు ప్లాస్టిక్ కవర్ల వాడకంపై పర్యావరణానికి పెను ప్రమాదం సంభవిస్తుందని,ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలని అవగాహన కల్పించారు.ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహణలో భాగంగా మూడవ రోజు గ్రామంలోని ప్రధాన వీధులు,రహదారులను శుభ్రము చేసి గ్రామంలోని నర్సరీ కేంద్రంలో కలుపు మొక్కలను ఏరివేశారు.తదనంతరం ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జీ. తిరుపతి,కోమల,హరీష్,వాలంటర్లు పాల్గొన్నారు.
