- ప్రశ్నించడమే పత్రికల సహజ లక్షణం.
హనుమకొండ హరిత హోటల్లో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల ఆర్ సి లు బ్యూరోలు ఇన్చార్జిలు వివిధ మండలాల రిపోర్టర్స్ 12వ వార్షికోత్సవ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ వాణి ఎడిటర్ జేరిపోతుల సంపత్ స్టేట్ కోఆర్డినేటర్ మామునూరి సంపత్,అఫ్జల్ పఠాన్ న్యూస్ కో ఆర్డినేటర్,సైదాపూర్ మండల్ తెలంగాణ వాణి జర్నలిస్ట్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ నిజాలను నిర్భయముగా రాస్తూ అక్షరాలను తూటాలుగా పేలుస్తూ అలుపెరుగని అక్షర యోధులు తెలంగాణ వాణి జర్నలిస్టులు అని, జర్నలిజం అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ప్రభుత్వం నుంచి ప్రతి పథకాన్ని ప్రజలకు అందే విధంగా చేస్తూ జర్నలిజం అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నిత్యం ప్రజల సమస్యలను ప్రజల బాధలను ప్రజల గోడును నిరంతరం ప్రజా సమస్యలపై అక్షరాలు తూటాలుగా రాస్తూ ప్రజల్లో ప్రజల హృదయాలలో తెలంగాణ వాణి దినపత్రిక నిలిచిపోయిందని తెలిపారు.పత్రికలు చిన్నవా పెద్దవా అనేవి కాదు మనం రాసే కథనాలను పట్టి మనకు విలువ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో లోని 33 జిల్లాల ఆర్ సి లు,బ్యూరోలు, ఇంచార్జిలు, వివిధ పట్టణాల జర్నలిస్టులు,వివిధ గ్రామాల జర్నలిస్టులు పాల్గొన్నారు.
