- ఎన్నికల కోడ్ ను ఉల్లంగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు
సైదాపూర్ మండలం:సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎస్ఐ మరియు సిబ్బందితో సంయుక్తంగా పెట్రోలింగ్ చేస్తుండగా సైదాపూర్ గ్రామ శివారులో ఒక వ్యక్తీ కాటన్ డబ్బాలో మద్యం బాటిల్లను పెట్టుకొని ఉండగా అతని ఆపి తనిఖీ చేయగా బొమ్మనపల్లి గ్రామానికి చెందిన మామిడి రాజయ్య వద్ద 10.980 లీటర్ల మద్యం బాటిల్లు సుమారు 9,900/- రూపాయల మద్యం లభ్యం కావడం జరిగిందని,వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున సైదాపూర్ మండలంలో బెల్ట్ షాప్ లు నడిపిన,మరియు డీజేలు పెట్టిన ఎన్నికల కోడ్ ను ఉల్లంగించిన వారి పై చట్ట పరమైన చెర్యలు తీసుకుంటామని సైదాపూర్ ఎస్ఐ జూన్ను ఆరోగ్యం తెలియజేయడం జరిగింది.
