కరీంనగర్ మార్చ్ 27:జమ్మికుంట మండలం పెద్దoపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దొడ్డె శ్రీనివాస్ ను బహుజన సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఉత్తర్వులు జారీచేశారు.మంగళవారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో దొడ్డె శ్రీనివాస్ ను జిల్లా అధ్యక్షునిగా నియమించారు. శ్రీనివాస్ పెద్దంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గా పనిచేశారు.2007లో బహుజన సమాజ్ పార్టీలో చేరిన ఆయన జిల్లా ఉపాధ్యక్షుడిగా,హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షునిగా,ఇన్చార్జిగా పనిచేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పనిచేస్తానని,పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు.రానున్న సర్పంచ్,ఎంపీటీసీ స్థానాల్లో అత్యధికంగా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు శాయశక్తుల కృషి చేస్తానని వివరించారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం,కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి అంకని భానులకు కృతజ్ఞతలు తెలిపారు.
