దుద్దేనపల్లీ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్

By dhanadhannews.com

సైదాపూర్ ఏప్రిల్ 03:సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లీ గ్రామంలో బుధవారం  రోజున సిఎస్ఎఫ్ పోలీస్ బృందంతో  గ్రామంలో కవాత్ నిర్వహించడం జరిగిందని సైదాపూర్ ఎస్సై జున్ను ఆరోగ్యం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సిఐ పి వెంకట్ మాట్లాడుతూ ఎలక్షన్లను ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని,ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియపరిచారు.ప్రస్తుత పరిస్థితులను సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని గాని మతం పేరుతో గాని కులం పేరుతో గాని వివాదాస్పరమైన ఎలాంటి పోస్ట్లు పెట్టకూడదని చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేపడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్థానిక ఎస్సై జున్ను ఆరోగ్యం తెలియజేయడం జరిగింది.