సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 11: సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం రోజున మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలను ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు రేగుల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహానీయుల ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.అణగారిన వర్గాలకు అక్షర దీపంగా వెలిగిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాయిశెట్టి చంద్రయ్య, వస్తాదుల సదానందం,నెల్లి పోచయ్య,బోల్ల హరీష్ లంకసిరి రాజు,నీర్ల వెంకట్రాజ్యం,బొమ్మగాని రాజు,గోపగాని నవీన్, మొలుగూరి తిరుపతి,నెల్లి రాములు,గాదపాక అశోక్, జక్కోజు బిక్షపతి,గూల్ల రాజు,తదితరులు పాల్గొన్నారు.
