పెద్ద మనస్సు చాటుకున్న మండల సైదాపూర్ ప్రజలు

By dhanadhannews.com

సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 23:సైదాపూర్ మండల కేంద్రంలోని మీ సేవ మీసే వెంకటేశ్వర్లు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.సైదాపూర్ మండలంలోని సదాశివ మీసేవలో సెంటర్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తూ మండల ప్రజలందరికీ పరిచయమైన వ్యక్తి వెంకటేశ్వర్లు,ఆయన మరణవార్త విన్న మండల ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.మండల ప్రజలు తలా ఒక్క చేయివేసి చేసిన పోగుచేసిన 1,20,000/-లను పోస్ట్ ఆఫీస్ ఫిక్స్ చేసి బాండ్ వెంకటేష్ కుటుంబ సభ్యులకు స్థానిక ఎస్సై జున్ను ఆరోగ్యం చేతుల మీదుగా అందజేయడం జరిగింది.దాతలు సహకరించడానికి హెల్పింగ్ హాండ్స్ ఫర్ వెంకటేష్ మీసేవ ఫ్యామిలీ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన వారు మునిపాల అశోక్,గడ్డం శేఖర్,పల్లపు బాలకృష్ణ,మండల రమేష్,మెడవేని రమేష్,బేకరీ శ్రీకాంత్, రాఠి ఆర్ట్స్,కట్టోజు సద్గుణాచారి , తాటిపాముల అనిల్ కుమార్,ఈదులకంటి అమరేందర్ రెడ్డి,కాశపాక శ్రీనివాస్,వెంకటేష్ ఫ్యామిలీ కోసం కృషి చేశారు.స్థానిక ఎస్సై జున్ను ఆరోగ్యం తనవంతు సహాయంగా 2000 రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.