ప్రైవేట్ దవాఖానపై జిల్లా కలెక్టర్,జిల్లా వైద్య అధికారులకు ఫిర్యాదు

By dhanadhannews.com

జిల్లా వైద్యాధికారికి పిర్యాదు చేస్తున్న పేషెంట్ భర్త

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 25:జమ్మికుంట పట్టణంలోని మమత హస్పటల్ లో తనకు జరిగిన అన్యాయం గురించి మమత హాస్పటల్ యాజమాన్యంపై జమ్మికుంట పట్టణానికి చెందిన లావణ్య భర్త రచ్చ రవికృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి (డి.ఎం.హెచ్.ఓ) లకు  ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితే పేషెంట్ ప్రెగ్నెన్సి పరిక్షకు వెళ్ళగా థైరాయిడ్ మరియు ఇతర టెస్టుల కోసం రక్తం షాంపిల్స్ ఇవ్వడం జరిగింది.ఒక వారం రోజుల తరువాత రిపోర్ట్స్ వస్తాయని తెలిపారు.ఈ నెల 6వ తారీకు రోజున రక్త నమూనాలు తీసుకున్నారు.వారం తరువాత హాస్పటల్ కు వెళ్ళి వైద్య సిబ్బందిని రిపోర్ట్స్ అడుగగా ఇంకా రాలేదని నిర్లక్ష్య సమాదానం చెప్పారు.ఇలా రోజు వెళ్లి అడుగగ ఇంకా రిపోర్ట్స్ రాలేదని చెప్పారు.ఈ నెల 24 బుధవారం రోజున హాస్పటల్ కు వెళ్ళి హాస్పటల్ సిబ్బందిని రిపోర్ట్స్ గురించి ఎందుకు ఇలా తిప్పించుకుంటున్నారని అడగగా మీ రక్త నమూనాలు(షాంపిల్)మిస్ అయ్యాయని మళ్లి రక్త నమూనాలు ఇవ్వాలని మళ్ళీ టెస్టులకు పంపిస్తామని నిర్లక్యంగా వ్యవహరిస్తూ తమపై దురుసుగా ప్రవర్తించారు.పేద ప్రజలను టెస్టుల పేరుతో దోచుకుంటున్న మమత హాస్పటల్ పై చట్ట పరమైన చర్యలు తీసుకొని తనకు జరిగిన
అన్యాయానికి,న్యాయం చేయాలని బాధిత దంపతులు గురువారం రోజున జిల్లా కలెక్టర్,వైద్య అధికారికి ఫిర్యాదు చేశారు.