- సదరం సర్టిఫికెట్ల అవకతవకల్లో ఔట్ సోర్సింగ్,పిర్వోల చేతి వాటం
- సదరం సర్టిఫికెట్ల అవకతవకల పై సిబిసిఐడికి ఫిర్యాదు చేస్తాం
- ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగేందర్
కరీంనగర్/ధనాధన్ న్యూస్: సదరం సర్టిఫికెట్ల అవకతవకలపై సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని మేము చేసే పనులకు మాత్రం ఏ లెక్క లేదు..అన్న చందంగా జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ (డిఆ ర్డీఏ) అధికారులు సంబంధిత సూపిరింటెండెంట్ వ్యవహరిస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సదరం సర్టిఫికేట్లలో లక్షల రూపాయల కుంభకోణంపై సిబిసిఐడి విచారణ జరిపించాలని తాము మొదటి నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. అధికారులందరూ లక్షల రూపాయలను పప్పుబెల్లంలా పంచు కున్నారని, కంచే చేను మేసిందని, ప్రశ్నించారు. పాత్రధారులు, సూత్రధారులు అందరూ ఆ శాఖలోనే ఉన్నారని ఆరోపించారు.ఒక డిపార్ట్మెంట్ వారు తప్పు చేస్తే వేరే డిపార్ట్మెంట్ అధి కారితో పూర్తిస్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపి స్తారని, కానీ దానికి విరుద్ధంగా ఈ విచారణ జరిగిందన్నారు.నిబంధనల ప్రకారం సదరం క్యాంపు 200 మందికి మాత్రమే స్లాట్ బుకింగ్ విధానం ఉంటుందని, కానీ దానికి భిన్నంగా హుజురాబాద్ లో సదరం క్యాంపు ఆకస్మికంగా నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అడిషనల్ డిఆర్డిఓ వెంకటేశ్వర్లు నేతృ త్వంలో జరిగిన విచారణ కమిటీ గత యేడాది జనవరి 2021 నుంచి 2022 ఫిబ్రవరి వరకు విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక సమర్పించిందని,కానీ హుజురాబా ద్లో జరిగిన సదరం సర్టిఫికెట్లపై విచారణ ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుప త్రిలో ఇద్దరు కంప్యూటర్ ఆపరేట్లు లక్షల రూపాయలు వసూలు చేశారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి వెనుక ఉన్న పాత్రదారులు,సూత్రదారులను బయటకు లాగాలన్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
