యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

By dhanadhannews.com

  • జమ్మికుంట సీఐ వరంగంటి రవి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: వరల్డ్ యాంటీ స్మోకింగ్ డే సందర్భంగా జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి మీడియాతో మాట్లాడుతూ సిగరెట్ తాగే అలవాటు వల్ల అనేక ప్రాణాంతకమైన వ్యాధుల పాలు అయ్యే  అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత సిగరెట్లకు,మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. స్నేహితులతో సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారి జీవితాలను నాశనం అయ్యే స్థితికి మత్తు పదార్థాలు చేరుస్తాయని కాబట్టి వాటికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తన పట్ల దృష్టి పెట్టాలని అన్నారు.సిగరెట్ అలవాటు అయిన వారికి గంజాయి లాంటి రకరకాల మత్తు పదార్థాలకు ఎడక్ట్ అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.మత్తు పదార్థాలు ఎవరు వినియోగించినా,సరఫరా చేసిన కఠిన చర్యలు తప్పవని అన్నారు.