మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలుగా తోట స్వప్న 

నియామక పత్రం అందిస్తున్న ప్రణవ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణం మోత్కులగూడెం కు చెందిన తోట స్వప్న ను జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గా నియమించినట్లు మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కర్ర సత్య ప్రసన్న నియామక పత్రాన్ని పత్రాన్ని జారీ చేశారు. నియామక పత్రాన్ని హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి  వొడతల ప్రణవ్ బాబు తోట స్వప్నకు అందజేశారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ  నాపై నమ్మకంతో జమ్మికుంట మండల అధ్యక్షులుగా నియమించినందుకు  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా  ఇంచార్జ్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి జిల్లా మంత్రులు, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల  శ్రీధర్ బాబు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సత్య ప్రసన్న,నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారిని పార్టీ అండగా ఉంటుందని పార్టీ నాపైన పెట్టిన నమ్మకాన్ని గ్రామాల్లో పార్టీని బలపేతం చేయడానికి సాయశక్తితో పనిచేస్తానని అన్నారు. మండల పరిధిలో గ్రామాల్లో గ్రామసై కమిటీలు వేసి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క కుటుంబానికి చేరే విధంగా పనిచేసి, ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందించే విధంగా పనిచేస్తానని అన్నారు.