రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

By dhanadhannews.com

  • రైతు యువజన నాయకుడు నీల పున్నం చందర్

వీణవంక/ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఎక్కడ జరిగిందో వివరించాలని వీణవంక మండల కేంద్రానికి చెందిన రైతు నాయకుడు నీల పున్నం చెందర్ అన్నారు. గడిచిన సంవత్సర కాలం నుంచి ఇప్పటివరకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికి కూడా రుణమాఫీ కాక లబోదిబో అంటున్న రైతులు, ఎవరికి రుణమాఫీ చేశారు. మేము రైతులం కాదా మాకెందుకు రుణమాఫీ చేయలేదు.. ఇప్పటివరకు మా గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి వోడితల ప్రణవ్ కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలే కొన్ని రోజుల్లో మాకు రుణ మాఫీ కాకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వారు పేర్కొన్నారు. రైతు కండ్లల్లో నీళ్లు చూసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదు  రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని అన్నారు.