- తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా హింసపెడుతున్నారు
- కోరపెల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తప్పుడు పత్రాలు సృష్టిస్తూ అధికారులను మోసం చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్న భూ కబ్జాదారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్యఅన్నారు .మంగళవారం జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను మానసికంగా హింసిస్తున్నారని, ప్రజల్లో తనను ఒక తప్పుడు వ్యక్తిగా సూచిస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .దళితుడైన తనను కొంతమంది కావాలని పని కట్టుకొని తనపై అసత్య ప్రచారానికి ఒడిగట్టారని తీవ్రంగా దుయ్యబట్టారు . కోరపల్లి గ్రామ చర్చి పాస్టర్ ఆకనపల్లి అనిల్, గీరబోయిన శ్రీనివాస్, పింగిలి రాకేష్, పింగిలి చక్రపాణి, కందికట్ల మధుసూదన్ లు కలిసి అనధికారంగా తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ అధికారులను మోసం చేస్తూ వాళ్ల అక్రమాలకు సహకరిస్తలేనని కొన్ని సంవత్సరాలుగా తనని రాజకీయంగా కొంతమంది గిట్టని వ్యక్తుల సహకారంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ భూభారతిలో తనపై ఫిర్యాదు చేశారని, రోడ్లపై బైఠాయిస్తూ తనని మానసికంగా హింసిస్తున్నారని వారి అక్రమాలకు సహకరించనందున వారు తనపై కక్ష కట్టారని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య తెలిపారు. వారి అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని వాటిని ఉన్నతాధికారులు సమర్పిస్తానని ,వాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి దోషులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన పేర్కొన్నారు .తనపై తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తున్న వారి అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలతో కరీంనగర్ కలెక్టరేట్ నందు ప్రజావాణిలో ఫిర్యాదు చేశానని అయినా మీడియా ద్వారా తన బాధను తెలుపుతూ తనకు న్యాయం చేయాలని బోయని సమ్మయ్య ఉన్నతాధికారులను కోరారు.
