- కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలపై విఫలమైందని విమర్శ
- కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వయిరీ రద్దు చేయాలని డిమాండ్
సైదాపూర్, సెప్టెంబర్ 2 (ధనాధన్ న్యూస్):
సైదాపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.
మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య మాట్లాడుతూ –
రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. వారానికి ఒక్కటి రెండు లారీలు యూరియా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేసి, సిబిఐ ఎంక్వయిరీ వేయడం రైతులకు వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం పై రాజకీయం చేయకుండా, రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ రైతుల ఇబ్బందులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రైతులు నమ్మి ఓటు వేసి గెలిపిస్తే, ఇబ్బందుల్లో వదిలేసినట్టే కనబడుతోందని మండిపడ్డారు.
ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి, యూరియా సరఫరా కోసం నిరంతరం పోరాటం చేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేసి, అనంతరం తహసిల్దార్ శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు::
మాజీ ఎంపీపీలు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, బిసా వెంకటయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, వెన్నంపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు బిల్లా వెంకట్ రెడ్డి, నాయకులు రాజేశ్వర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఎలుకపెళ్లి రవీందర్, ఉపాధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ, రాజరెడ్డి మోహన్ రావు, యుగేందర్ రెడ్డి, అబిడి రవీందర్ రెడ్డి, చిక్కుల సంపత్, కోల్ల శంకర్ రెడ్డి, మట్టెల రవీందర్, హరీష్, జితేందర్ రెడ్డి, అరవింద్, బానోత్ రమేష్ నాయక్, బర్మావత్ శంకర్ నాయక్, నారాయణ, కొంకట సంపత్, మహిపాల్ సింగ్, ఎరుగొండ శ్రీనివాస్, సోమారపు సమ్మయ్య, విజయ్, రాజేందర్ సింగ్, తాళ్లపల్లి వేణు గోపాల్ గౌడ్, మాదం స్వామి, మునిపాల శ్రీనివాస్, సంపత్ ముదిరాజ్, గూళ్ల అశోక్, సంపత్, సుద్దాల నర్సింగ్, భాష, వేణి, సదానందం తదితరులు,పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
