- బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు
జమ్మికుంట/ధనాధన్ న్యూస్:
జమ్మికుంట పట్టణంలో శనివారం కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ చేసిన పత్రికా ప్రకటనలో తమపై చేసిన ఆరోపణలను జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు కొలకాని రాజు ఖండించారు. వాట్సాప్ గ్రూపులో నిధులు తానే తెచ్చుకున్నట్టు చెప్పుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం పూర్తిగా తప్పుడు వాదమని ఆయన స్పష్టం చేశారు.
కొలకాని రాజు మాట్లాడుతూ – “మేము బిజెపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించామని, స్పందన రాకపోతే మున్సిపల్ ఆఫీస్ ముట్టడి, నిరసన ర్యాలీలు నిర్వహించామని,వాటి ఫలితంగానే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు. మేము చేసిన పోరాటానికి ఫలితమే ఈ నిధుల మంజూరు. అందుకే మున్సిపల్ కమిషనర్‌కి, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపామని పేర్కొన్నారు.
అలాగే “మేము పోస్ట్ చేసిన విషయాన్ని పూర్తిగా చదవకుండా, అర్థం చేసుకోకుండా తప్పుగా అర్థం చేసుకోవడం అవివేకం. చదువు రాకపోతే ఎవరితోనైనా చదివించుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వారు లేరు” అని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, రాజేష్ ఠాకూర్, కైలాసకొటి గణేష్, బచ్చు శివన్న, అప్పాల రవీందర్, చందా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
