- కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిక
- జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాయిన్
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్ సొంత గూటికి చేరారు. బుధవారం హుజురాబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా మద్దుల ప్రశాంత్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ కండువా కప్పి ఘనంగా పార్టీలోకి స్వాగతం పలికారు.గతంలో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసిన మద్దుల ప్రశాంత్, కరోనా కష్టకాలంతో పాటు పలు సందర్భాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలిచారు. ఆయన మళ్లీ బీజేపీలో చేరడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.ఈ సందర్భంగా మద్దుల ప్రశాంత్ మాట్లాడుతూ,బండి సంజయ్ నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, వీణవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్, జిల్లా నాయకులు చెన్నమనేని నరసింహారాజు, రామిడి ఆదిరెడ్డి, గొడుగు వినోద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
