గురువు ఆశీస్సులతో ప్రజాసేవ బాటలోకి అరికిల్ల స్రవంతి

By dhanadhannews.com

  • స్రవంతిని ఆశీర్వదించిన ఆచార్య కోదండరాం
  • జనసమితి ఉద్యమాల నుంచి కౌన్సిలర్ గమ్యం వైపు స్ఫూర్తిదాయక ప్రయాణం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం శిష్యురాలు అరికిల్ల స్రవంతి తన రాజకీయ ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు.జమ్మికుంట మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన రాజకీయ గురువు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ,జనసమితి పార్టీ ఆవిర్భావం నుంచే స్రవంతి పార్టీకి వెన్నెముకలా నిలిచిందని అన్నారు.కార్యకర్త స్థాయి నుంచి ప్రారంభమైన ఆమె ప్రయాణం జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ మహిళా విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిందని ప్రశంసించారు.ప్రజా సమస్యలపై నిబద్ధత, పోరాట స్ఫూర్తి, ఉద్యమ అనుభవమే ఆమె బలం అని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో స్రవంతి కౌన్సిలర్‌గా గెలిచి ప్రజలకు మరింత దగ్గరగా సేవలందించాలని ఆకాంక్షించారు.ఆమె రాజకీయ జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని గురువుగా హృదయపూర్వకంగా దీవించారు.గురువు ఆశీస్సులు, జమ్మికుంట 24 వ వార్డు ప్రజలపై నమ్మకంతో స్రవంతి ప్రజాసేవ బాటలో ధైర్యంగా ముందుకు సాగుతున్నారు.