- కౌన్సిలర్ డాక్టర్ సురంజన్‌కు సన్మానం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు జై భీమ్ కాలనీలో యువతలో మంచి మార్పు తీసుకురావడం, సమాజంలో పోటీ తత్వం పెంపొందించడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం లక్ష్యంగా నూతనంగా ఎస్సీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్ సురంజన్ ని ఘనంగా సన్మానించారు. అదే వేదికపై కమిటీకి ఎన్నికైన సభ్యులను కూడా కౌన్సిలర్ సురంజన్ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
కమిటీ పదవులు
అధ్యక్షులు: రామ్ రాజబాబు
గౌరవ సలహాదారులు: శనిగరపు సంపత్, పారందుల వీరభద్రయ్య, బండ సారయ్య, సముద్రాల సంపత్, పోగుల పోచయ్య, మారేపల్లి పోశెట్టి
ఉపాధ్యక్షులు: ఎలకపల్లి రాజేష్, మారేపల్లి యాదగిరి, మిడిదొడ్డి శంకర్, బోడికల మల్లయ్య, శనిగరపు రవి
ప్రధాన కార్యదర్శి: వీర్ల రాజేష్
కోశాధికారి: బోడికల రాజు
అధికార ప్రతినిధి: పుల్లూరి ప్రశాంత్
సంయుక్త కార్యదర్శి: తిప్పారపు రాజనర్సింహ
సహాయ కార్యదర్శులు: మారేపల్లి కార్తీక్, ఎనగందుల శంకర్
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్
చెన్నమల్ల మహర్షి, బోడికల నరేందర్
ముఖ్య కార్యవర్గ సభ్యులు
మారేపల్లి రవి, సుంకిత కిషన్, నాగండ్ల ప్రసాద్, కొత్తూరి సమ్మయ్య, దాసరపు వీరస్వామి, మాట్ల చందు, మారేపల్లి పోచయ్య, ఆరేపల్లి కరుణాకర్, మారేపల్లి శ్రీనివాస్, ఆరేపల్లి సురేష్, చిలువేరు ప్రసాద్, మారేపల్లి ఏలియా, రాసపల్లి వెంకటేష్ తదితరులు.
కార్యక్రమం అనంతరం గొప్ప సంఘసంస్కర్త, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు Savitribai Phule వర్ధంతి సందర్భంగా కమిటీ సభ్యులు ఐదు నిమిషాల పాటు మౌనం పాటించి ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో రమేష్, సుమన్, రాజు, కుమార్, అరుణ్, సంపత్, సాయి ప్రేమ్, తిరుపతి, రాజయ్య, సలీం, శ్రావణ్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.