
జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 3: తెలంగాణ ఉద్యమ యోధుడు, రైతు బాంధవుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో టి హెచ్ ఆర్ టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సమీపంలోని శివాలయం (బొమ్మల గుడి)లో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.
టి హెచ్ ఆర్ టీం రాష్ట్ర కమిటీ మరియు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ వర్మ అప్పని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్లు తక్కలపల్లి రాజేశ్వరరావు, పోడేటి రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకులను పదవులతో కొలవలేమని అన్నారు. అధికారం కోల్పోయినా ప్రజాదరణ కోల్పోని నాయకుడు హరీష్ రావు అని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజల ప్రేమాభిమానాల ముందు అవన్నీ నిలవలేవని అన్నారు.
రైతుల కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ, తెలంగాణ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసిన నాయకుడిగా హరీష్ రావు గుర్తింపు పొందారని కొనియాడారు. పదవులు శాశ్వతం కాకపోయినా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన నాయకులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొంటూ హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పొడగంటి సంపత్, మాజీ కౌన్సిలర్లు జుగురి సదానందం, బొద్దుల రవీందర్, పాతకాల రమేష్, గాజుల భాస్కర్ పాల్గొన్నారు.
అలాగే టి హెచ్ ఆర్ టీం సభ్యులు వోల్లాల శ్రీకాంత్ గౌడ్, జవ్వాజి అనిల్, కాట్రేవుల అజయ్, చింతల కౌశిక్, కుమార్, నల్లగాస హరీష్, నరెంగుల శివ, హరీష్ సందీప్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.