గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 10:
జగిత్యాల పట్టణంలోని వాణీనగర్‌లో నిర్వహించిన శ్రీ గంగమ్మ జాతర ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ గంగమ్మ తల్లికి బోనాలు ఎత్తుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గంగమ్మ తల్లి కటాక్షంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతర ఉత్సవాలను విజయవంతం చేశారు. గంగమ్మ తల్లి నామస్మరణలతో వాణీనగర్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జాతర సందర్భంగా భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

Leave a comment