- జగ్గయ్యపల్లి గ్రామంలో జరిగిన పోచమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రణవ్
- ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు
- సీసీ రోడ్ నిర్మాణానికి ప్రణవ్ బాబు కృషి


జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఊర్లను కాపాడే అమ్మవార్లు ప్రజలకు ఇష్టమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో గ్రామ దేవతలైన శ్రీ మహాలక్ష్మి,భూ లక్ష్మీ,నాభి శిల (బొడ్రాయి),పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం పోచమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జగ్గయ్యపల్లి గ్రామంలో ఇటీవల సీసీ రోడ్ నిర్మాణానికి కృషి చేసిన ప్రణవ్ బాబుకు జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు శాలువాతో సత్కరించారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని,ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పై ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఉత్సవ కమిటీ,పాలకవర్గం,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.