జమ్మికుంట/ధనాధన్ న్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన బీసీ మహిళ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉప సర్పంచ్‌ల ఫోరం జమ్మికుంట మండల అధ్యక్షుడు దొంతరవేన రమేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ మహిళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. జక్కిడి శివచరణ్ రెడ్డి వెంటనే పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు, యాదవ జాతికి, బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


లేనిపక్షంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే జక్కిడి శివచరణ్ రెడ్డి నివాసాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి వ్యాఖ్యలనైనా సహించబోమని, బీసీ సమాజం ఐక్యంగా స్పందించి తగిన విధంగా సమాధానం ఇస్తుందని దొంతరవేన రమేష్ యాదవ్ స్పష్టం చేశారు.

Leave a Reply