మహా ముత్తారం,జూలై 23 (ధనాధన్ న్యూస్): ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులను పోలీసులు నిర్బంధించడాన్ని ఖండిస్తూ మహా ముత్తారం మండలం యామన్‌పల్లి చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కారణంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ అంశంపై నిరసన తెలిపేందుకు ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ జాతీయ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, రాహుల్ గాంధీకి సంఘీభావంగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాటారం డివిజన్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొండగొర్ల బాపు, మాజీ జడ్పీటీసీ లింగమల్ల శారద–దుర్గయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు ధరంసోత్ సుజాత, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశీరాజ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు నజీర్ ఖాన్, సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షుడు గోస్కుల సత్యం, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామోజీ, మహిళా ఉపాధ్యక్షురాలు బౌతు రమ్య, మండల కార్యదర్శులు మోత్కూరు రవి, మేకల మల్లయ్య, పలువురు సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply