
జగిత్యాల/ధనాధన్ న్యూస్: కరీంనగర్ తెలంగాణ శ్రీనివాసులు సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో తెలంగాణ శ్రీనివాసులు సేవా సంస్థ, కోరుట్ల శ్రీనివాస్ మిత్రుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 20 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ఈ రక్తదాన శిబిరాన్ని కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, జిల్లా వైద్యాధికారి, వైద్య సిబ్బంది సందర్శించి నిర్వాహకులను, రక్తదాతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల నుంచి గాజుల శ్రీనివాస్, బోగా శ్రీనివాస్‌తో పాటు పలువురు శ్రీనివాస్ మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
