
జగిత్యాల, ధనాధన్ న్యూస్: పట్టణంలోని పురాణిపేట శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం 64వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఆశీస్సులతో జగిత్యాల పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులను అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి, తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
