జగిత్యాల, ధనాధన్ న్యూస్: తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్‌లో ఉన్న ఆయన విగ్రహానికి బీసీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన త్యాగాలు, సేవలు, పోరాటాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పదవులు, ఆస్తులను త్యాగం చేయడానికి వెనుకాడకుండా స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవితాంతం పోరాడిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.
బహుజన, బీసీ వర్గాల ఆత్మగౌరవానికి కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రతీకగా నిలిచారని, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యంగా చేనేత వృత్తి అభివృద్ధికి అనేక సంస్కరణలు, సూచనలు అందించి ఆ రంగం అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తిస్తూ హార్టికల్చర్ కళాశాలలకు ఆయన పేరు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తెలంగాణ సాధన ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు, త్యాగాలు తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

ప్రభుత్వాలు మారినా బీసీలు, బహుజనుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేయాలని, సమాన హక్కులు, సామాజిక న్యాయం సాధనకు కొండ లక్ష్మణ్ బాపూజీ చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలు నెరవేరాలంటే ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని పాలన సాగించాల్సిన అవసరం ఉందని దావ వసంత సురేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాణి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ పవిత్ర మహేష్, డా. అరుణ, నందయ్య, జ్యోతి లక్ష్మణ్, పద్మశాలి సంఘం పెద్దలు బాలే శేఖర్, వీరబత్తిని అనిల్, సింగం గంగాధర్, వొళ్లాల గంగాధర్, చెట్పెల్లి సుధాకర్, ఎలిగేటి నరసయ్య, వనమాల నిరంజన్, రాజశేఖర్, రాజా లింగం, బీఆర్‌ఎస్ నాయకులు వొళ్లం మల్లేశం, దయాల మల్లారెడ్డి, గంగారెడ్డి, తుమ్మ గంగాధర్, అనురాధ, ప్రణయ్, సన్నిత్, భగవాన్, కావేటి నవీన్, ఆడెపు సత్యం, గాజుల శ్రీనివాస్, గంగిపెళ్లి వేణుమాధవ్, కస్తూరి గంగాధర్, నాగేష్, మహేష్‌తో పాటు బీసీ సంఘాల నాయకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply