పరకాల, ధనాధన్ న్యూస్: తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.బతుకమ్మ పండుగలో తొలి రోజైన ఎంగిలిపూల బతుకమ్మను గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి,ఒకచోట చేరి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.

అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ,కోలాటాలు,ఆటపాటలతో సందడి చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా,మహిళల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవనశైలికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తరతరాలుగా కొనసాగిస్తూ,సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని గ్రామస్తులు పేర్కొన్నారు.

Leave a Reply