
హనుమకొండ,ధనాధన్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా గ్రామాలలోని మహిళలు,ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు,ఆటపాటలతో పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా నానే బియ్యం బతుకమ్మను జరుపుకున్నారు. పూల పండుగ బతుకమ్మ మహిళల ఆత్మీయత, ఐక్యతకు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని,బతుకమ్మ ఆట,పాటలతో గ్రామాల్లో సందడి నెలకొంది.
