- ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం
- నడికూడ తహసీల్దార్ రాణి

నడికూడ, ధనాధన్ న్యూస్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన పట్టభద్రులు ఓటర్ గా నమోదు చేసుకోవాలని నడికూడ మండల తహసీల్దార్ రాణి సూచించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.అర్హత ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోకపోతే భవిష్యత్తులో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుందని అందువల్ల అర్హులైన పట్టభద్రులు అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత హెల్ప్ డెస్క్లను సంప్రదించి,ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని తహసిల్దార్ కోరారు.
