- క్లస్టర్ ఇంచార్జ్ గుడికందుల శివ

నడికూడ, ధనాధన్ న్యూస్: నడికూడ మండల పరిధిలోని కంఠాత్మకూర్ గ్రామంలో పట్టభద్రుల ఓటర్ నమోదు క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అర్హులైన పట్టభద్రుల నుండి క్లస్టర్ ఇంచార్జీ గుడికందుల శివ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కొరకై దరఖాస్తులు స్వీకరించి ఓటు నమోదు చేశారు.ఈ సందర్భంగా క్లస్టర్ ఇంచార్జీ గుడికందుల శివ మాట్లాడుతూ గ్రామంలో నవంబర్ 2023 లోపు డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి లు,బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
