మోడల్ స్కూల్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ

By dhanadhannews.com

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే22:సైదాపూర్ మండలంలోని సోమరం గ్రామంలో గల మోడల్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రధమ సంవత్సరంలో ప్రవేశాల కొరకు  పదవ తరగతి లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుండి దరఖాస్తు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ ఫర్హానా తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ మోడల్ స్కూల్ వెబ్ సైట్ ద్వారా ఎంపీసీ,బైపీసీ,సీఈసీ,ఎంఈసి,గ్రూపుల్లో ప్రవేశాల కోసం ఈనెల 25 లోపు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రవేశం పొందిన బాలికల కోసం ఉచిత హాస్టల్ సౌకర్యం కూడా ఉన్నది.పదిలో వచ్చిన మార్కులు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని ప్రిన్సిపాల్  తెలిపారు.