విద్యను వ్యాపారంగా మారుస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

  • నిబంధనలు పాటించని శ్రీ చైతన్యకు విద్యాశాఖ
    అధికారుల అండదండలు
  • ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 18: కరీంనగర్ నగరంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలల యజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో పుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని శ్రీ చైతన్య పాఠశాలలో విజ్ఞాన కేంద్రాలుగా కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారాయని శ్రీ చైతన్య పాఠశాలలు నిబంధనలు పాటించకపోతే ఆ పాఠశాలలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భౌతిక దాడులు చేస్తామని ఒక్క రూపాయి ఎక్కువ ఫీజులు వసూలు చేసిన ఊరుకునేది లేదని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ హెచ్చరించారు.

గురువారం  ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లి లోని శ్రీ చైతన్య పాఠశాల వారు  పాఠశాల పేరుతో అధిక ధరలకు పుస్తకాలు అమ్మడాన్ని నిరసిస్తూ ఆ పాఠశాల ముందు ధర్నా చేసి పక్కన ఒక ఇంట్లో ఉన్న పుస్తక స్టోర్ నీ  చూపిస్తే మండల విద్యాధికారి వచ్చి స్టోర్ ను  సీజ్ చేయకుండా పాఠశాలకు వత్తాసుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మచ్చ రమేష్ మాట్లాడుతూ  శ్రీ చైతన్య పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలు పాటించడం లేదని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని  శ్రీ చైతన్య పాఠశాల వారు పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతూ తల్లిదండ్రుల వద్ద నుండి వేలాది రూపాయల వసూలు చేస్తున్నారని తమ పాఠశాల స్టోర్ లోని పుస్తకాలు కొనాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు బెదిరిస్తున్నారని శ్రీ చైతన్య పాఠశాల వారు తోక పేరు అయిన టెక్నో పేరుతో ప్రచారం చేస్తూ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నారని విద్యాశాఖ అధికారులు శ్రీ చైతన్య పాఠశాలలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని,శ్రీ చైతన్య పాఠశాల వారు నిబంధన విరుద్ధంగా ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసిన ఊరుకునేది లేదని, ఆ పాఠశాలలపై భౌతిక దాడుల్లోకి దిగుతామని మచ్చ రమేష్  హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్  రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్,నగర నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, నాగుల జ్ఞానేశ్వర్, బోయినీ విష్ణు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment