- ఏఐఎఫ్ డిఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై బుక్ స్టాల్ యాజమాన్యాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్ డిఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం లో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ సిండికేట్ అయ్యారని బుక్ స్టాల్స్ యజమానియాలతో ఒప్పందం చేసుకున్నారనీ బుక్ స్టాల్స్ యాజమాన్యాల దగ్గరికి వెళ్లి తక్కువ ధర ఉన్న పుస్తకాలకు ఎక్కువ ధరలకు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 2025-26విద్యా సంవత్సరం మొదలు కాకముందే ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్ డీఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పట్టణంలో ఉన్న బుక్ స్టాల్స్ ను తనిఖీ చేయాలని మండల విద్యాధికారి హేమలతను కోరారు.
