జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్07:ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన గన్ను శ్యామ్ సుందర్ ప్రమాదవశాస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించగా జమ్మికుంట లోని ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లో గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాపై గల ప్రమాద బీమా 1లక్ష రూపాయల చెక్కుని మృతుని భార్య గన్ను అరుణ కి ఇల్లందకుంట మండల వ్యవసాయ అధికారి రజిత సమక్షంలో జమ్మికుంట బ్రాంచ్ మేనేజర్ ఒద్దుల మహేందర్ అందజేశారు. అనంతరం వ్యవసాయ అధికారి రజిత మాట్లాడుతూ గాయత్రి బ్యాంక్ ఖాతాదారులకు బ్యాంకు సేవలతోపాటు,కనీస డిపాజిట్ తోనే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ పేద,మధ్య తరగతి వినియోగదారులకు ప్రమాద బీమా కల్పిస్తున్న బ్యాంకు సిబ్బంది పట్ల హర్షం వ్యక్తం చేశారు. గాయత్రి బ్యాంకు వినియోగదారుల ఆర్థిక ప్రగతికి సహకారం అందిస్తుందని,24 గంటల ఏటీఎంలో నగదు అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజల అవసరాలు తక్షణమే తీరుస్తుందని అభినందించారు.అనంతరం బ్రాంచ్ మేనేజర్ ఒద్దుల మహేందర్ మాట్లాడుతూ వినియోగదారులకు తక్కువ వడ్డీకే బంగార ఆభరణాలపై గ్రాము కు అత్యధికంగా 5వేల రూపాయలతో రుణాలు అందిస్తున్నామని, రైతులకు వ్యవసాయ రుణాలు కూడా తక్కువ వడ్డీ రేటుకే అందిస్తున్నామని,జమ్మికుంట పరిసర ప్రాంతాలలో 16 సెంటర్లలో వినియోగదారుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి పెన్షనర్లకు,ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు,వినియోగదారుల సేవ కేంద్రం వద్ద తమ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు అని,గాయత్రి బ్యాంకులో సేవింగ్ ఖాతాలు ప్రారంభించుటకు కేవలం ఆధార్ కార్డు, పాన్ కార్డ్ తో వచ్చినట్లయితే పాస్ ఫోటోలు జిరాక్స్ లు బ్యాంకు లోనే తీసి సేవింగ్ ఖాతాలు ఓపెన్ చేయబడతాయని,వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కోరకు రుణాలు కూడా అందిస్తున్నామని ఈ సదవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని గాయత్రి బ్యాంకు మేనేజర్ ఒద్దుల మహేందర్ తెలిపారు.
