పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

By dhanadhannews.com

  • సంఘమిత్రలో 2006-08 ఇంటర్ బ్యాచ్
  • 16 ఏండ్ల తరువాత ఒక్క చోట కలిసిన మిత్రులు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్02:జమ్మికుంట పట్టణంలోని స్థానిక మయూరి పంక్షన్ హాల్ లో సంఘమిత్ర జూనియర్ కళాశాల 2006-08 ఇంటర్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.16 సంవత్సరాల క్రితం తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువుల అడ్రస్సులు సేకరించి ఒకే వేదిక పై  వారిని ఏకం చేసి వారికి స్వాగతం పలికారు..అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గత స్మృతులను నెమరువేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాల తీపి కబుర్లు,తమ అనుబంధాలను స్మరించుకున్నారు.తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు, కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ, సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఆనందోత్సాహాలతో గడిపారు.పూర్వ విద్యార్థులు అధ్యపకులకు శాలువాలతో,మెమొంటోస్ తో ఘనంగా సన్మానించారు.16 సంవత్సరాల తర్వాత వివిధ ప్రాంతాల్లో స్థిర పడ్డటువంటి మిత్రులందరికీ ఒక దగ్గరికి చేర్చటువంటి ప్రయత్నం చేసిన పూర్వ విద్యార్థులు కంది ప్రవని రెడ్డి,ముంజల సుమంత్,దొంతుల రాకేష్,తాళ్లపల్లి శ్రీనివాస్ ని అధ్యాపకులతో పాటు పూర్వ విద్యార్థులు శాలువ తో సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు కళాశాల కరస్పాండెంట్ చదువు రాజేందర్ రెడ్డి, డైరెక్టర్లు మామిడి తిరుపతిరెడ్డి, ఏరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత 16 సంవత్సరాల క్రితం ఇంటర్ విద్యను బోధించిన తమని గుర్తుపెట్టుకుని ఆప్యాయంగా ఆహ్వానించడం గొప్ప విషయమని అన్నారు… తమ వద్ద క్రమశిక్షణ తో కూడిన విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఇతర బిజినెస్ రంగాలలో స్థిరపడి మరి కొంతమందికి సహాయం చేసే స్థాయిలో నిలబడినందుకు వారిని అభినందిస్తూ ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్, సాంబయ్య, కృష్ణారెడ్డి, రవి, సురేష్,రాజన్న,రామచందర్,విజయ్,రహమాన్,పూర్వవిద్యార్థులు రమణారెడ్డి,చిరంజీవి,మహేష్, నాగరాజు,పావని,స్వప్న,అమరావతి, వేణు,మౌనిక,ప్రియాంక,లావణ్య,మమత,రవి ప్రకాష్,జగన్,రవికుమార్,సాగర్,సురేందర్,అర్చన,తిరూప, నజ్మ,స్వాతి,రాజు,రాకేష్,పూర్ణ సుమారు పూర్వ విద్యార్థులు 70మంది పాల్గొన్నారు..