- బాధితునికి అండగా ఉంటా-మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్.
దళితబందు రెండవ విడత మంజూరు కావడం లేదని అప్పులు బాగా కావడంతో మనస్థాపనికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన బోడికెల శ్రీనివాస్ అనే వ్యక్తి ని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పరామర్శించడం జరిగింది.ఈ సందర్బంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బంద్ రెండవ విడత వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అలాగే బాధితుని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో టంగుటూరి రాజ్ కుమార్,మోలుగు దిలీప్,మంద రాజేష్,కోలుగూరి నరేష్,రామంచ రాకేష్,బండారి ప్రశాంత్,ప్రసన్న కుమార్,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
