- ఫీల్డ్ అసిస్టెంట్లు కన్నీటి ఆవేదన

నడికూడ, ధనాధన్ న్యూస్ : హనుమకొండ జిల్లా నడికూడ మండలం చౌటుపర్తి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మొగిలి విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి మస్టర్ డిమాండ్ నమోదు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న నడికూడ మండల ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో విద్యావతి,ఈసీ రజనీకాంత్‌తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు మొగిలి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.మాతోపాటు డ్యూటీ చేస్తూ,అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఆప్యాయంగా పలకరించే మొగిలి మా మధ్య లేకపోవడం బాధాకరమని తన జ్ఞాపకాలు మా హృదయాలలో ఎప్పుడు ఉంటాయని మమ్మల్ని వదిలి వెళ్లావా మొగిలి అన్న అంటూ,ఫీల్డ్ అసిస్టెంట్లు కంటతడితో ఆవేదన వ్యక్తం చేశారు.
